: ఉన్న కంపెనీలే వెళ్లిపోతుంటే.. పెట్టుబడుల వెల్లువ అంటూ కథలు చెబుతున్నారు: బొత్స


ఓ వైపు రాష్ట్రంలో ఉన్న కంపెనీలు వెళ్లిపోతుంటే... మరోవైపు రాష్ట్రంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయంటూ టీడీపీ నేతలు కట్టుకథలు అల్లుతున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఇప్పటివరకు ఎన్నో విదేశీ పర్యటనలు చేసిన చంద్రబాబు... ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. విదేశీ పర్యటనల పేరుతో చంద్రబాబు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో అందరికీ తెలుసని అన్నారు. అమెరికా పర్యటనలో ఏపీకి పెట్టుబడులు రావనే విషయం అందరికీ తెలుసని... అందుకే లోకేష్ ను అక్కడకు తీసుకెళ్లలేదని ఎద్దేవా చేశారు. అమెరికా పర్యటన ఫ్లాప్ అయిందనే భయంతోనే తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి సీనియర్ మంత్రి... వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. 

  • Loading...

More Telugu News