: మా పార్టీపైన, జగన్ పైన మీడియా దుష్ప్రచారం చేస్తోంది: బొత్స
తమ పార్టీపైన, తమ అధినేతపైన కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు అమెరికా పర్యటనకు, వైసీపీకి ముడిపెట్టి కొన్ని పత్రికలు, ఛానల్స్ అడ్డగోలు కథనాలను ప్రసారం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ జపంలా ఎప్పుడూ వైసీపీని, జగన్ ను విమర్శించడమే ఈ ఎల్లో మీడియా పని అని విమర్శించారు.
రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని... వాటన్నిటినీ పక్కనపెట్టి, వైసీపీపై దాడి చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. జగన్ అనంతపురం పర్యటనలో ఉంటే... లోటస్ పాండ్ లో జగన్, విజయసాయిరెడ్డిలు చర్చిస్తున్నారంటూ ఓ ఛానల్ లో బ్రేకింగ్ లు వేశారని మండిపడ్డారు. వాస్తవాలు ప్రజలకు చేరకుండా... తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నాయని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.