: అరుదైన అతిపెద్ద చేప దొరికితే...ఆడుకుని వదిలేశాడు...!


ధనలక్ష్మి ప్రత్యక్షమై బంగారు నాణేలిస్తే.. వెనకటికి ఒకడు 'తీసుకెళ్లడానికి సంచి లేద'ని తిరిగొచ్చాడట. ఈ సామెత ఇప్పుడు బ్రిటన్ మత్స్యకారుడు బెన్ బాండ్ కు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచ రికార్డు నెలకొల్పే అరుదైన అవకాశాన్ని బెన్ బాండ్ సునాయాసంగా వదలుకున్నాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... చేపల వేటలో చేయితిరిగిన తన స్నేహితులతో కలిసి బెన్ బాండ్ ఐర్లాండ్ సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. తన పడవకు ఉన్న గాలాన్ని సముద్రంలో జారవిడిచాడు. రెండు గంటల అనంతరం అతని ఆశలు ఫలించేలా సిక్స్ గ్రిల్ (ఆరు మొప్పలు) జాతికి చెదిన అరుదైన సొరచేప ఆయన గాలానికి చిక్కుకుంది. ఇది సముద్ర గర్భంలో ఉంటూ అరుదుగా మాత్రమే బయటకు వస్తుంది.

దీని బరువు సుమారు 500 కేజీలపై మాటే...గతంలో ఈ జాతికి చెందిన 1000 పౌండ్ల బరువున్న చేప పట్టుబడి అతిపెద్ద చేపగా రికార్డుల కెక్కింది. దీంతో 1500 పౌండ్ల బరువున్న ఈ చేపను ఒడ్డుకు చేర్చి ఉంటే... ఇంతవరకు పట్టుబడ్డ సిక్స్ గ్రిల్ చేపల్లో అతిపెద్ద చేపగా ఇది రికార్డులకెక్కేది. అయితే కేవలం 40 అడుగుల పొడవైన ఈ బోటులో 25 అడుగుల పొడవైన చేపను పట్టుకెళ్లడం ప్రమాదం. ఒకవేళ ఎలాగోలా దానిని బోటు ఎక్కించినా అది ఎవరో ఒకర్ని తినేసే ప్రమాదం ఉంది. దీంతో కోరి ప్రమాదం కొనితెచ్చుకోవడం ఎందుకని ఆలోచించిన బాండ్...రెండు గంటలసేపు దానితో ఆడుకుని, చివరికి తన గాలాన్ని తెంపి సముద్రంలో వదిలిపెట్టాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు.

  • Loading...

More Telugu News