: సోమిరెడ్డికి మంత్రి పదవి రావడానికి కారణమిదే: వైసీపీ నేత కాకాని గోవర్ధన్
ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఆయన ప్రత్యర్థి, వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. తమ అధినేత జగన్ ను విమర్శిచడం వల్లే సోమిరెడ్డికి మంత్రి పదవి దక్కిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికాకు వెళ్లింది పెట్టుబడుల కోసం కాదని, విరాళాల కోసమని విమర్శించారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలంటూ వచ్చిన ఈమెయిల్స్ ఎక్కడ నుంచి వచ్చాయో బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ చిన్న పిల్లాడు కావడం వల్లే చంద్రబాబు తన వెంట అమెరికా పర్యటనకు తీసుకెళ్లలేదని అన్నారు. ఏపీలోనే ప్రజాదరణ లేని చంద్రబాబుకు అమెరికాలో భద్రత పెంచారన్న వార్తలు సిగ్గుచేటని తెలిపారు. అమెరికా పర్యటన ద్వారా వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.