: దేశ సరిహద్దులో రిమోట్ ద్వారా శక్తిమంతమైన పేలుడు
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో శక్తిమంతమైన పేలుడు సంభవించింది. టెంగ్యుపోరల్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఈ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ట్రాన్స్-ఏషియన్ హైవే 102 ప్రాంతంలో రిమోట్ ద్వారా దుండగులు ఈ పేలుడును జరిపారు. పేలుడు జరిగిన సమయంలో హైవేపై 165 మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం లీమఖాంగ్లో ఆర్మీ ఆసుపత్రికి హెలికాప్టర్ లో తరలించారు.