: కదులుతున్న ట్రక్ లో భర్తను కట్టేసి... అతని కళ్ల ముందే 8 మంది గ్యాంగ్ రేప్...నిర్భయ తీర్పురోజే దారుణం!


నిర్భయ ఉదంతంలో నిందితులకు అత్యున్నత న్యాయస్థానం సరైన తీర్పునిచ్చిందని దేశవ్యాప్తంగా అభినందనలు వినిపిస్తున్న తరుణంలో.. అదే రోజు అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుని విస్మయానికి గురి చేస్తోంది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... కళాకారులైన దంపతులు జైపూర్‌ నుంచి యూపీలోని ఆరయకు వచ్చారు. అప్పటికే అర్ధరాత్రి కావడంతో అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం కోసం బస్సు కోసం వేచి చూస్తుండగా, అటుగా వచ్చిన ట్రక్‌ డ్రైవర్‌ ఎటువెళ్లాలని అడిగాడు. దీంతో వారు తాము వెళ్లాల్సిన ఊరు గురించి చెప్పగా, అప్పటికే ఆలస్యం అయిందని, బస్సులు ఉండవని చెప్పి, తాను కూడా అటే వెళ్తున్నానని వారిని మభ్యపెట్టి తనతో రమ్మన్నాడు.

వారు ట్రక్ ఎక్కిన తరువాత కొంత దూరం వెళ్లాక... ట్రక్ ను ఒక మద్యం దుకాణం దగ్గర ఆపాడు. అక్కడ మద్యం తాగిన ట్రక్‌ డ్రైవర్‌.. మరో ఏడుగురితో కలసి వచ్చి, భర్తను కట్టేసి, కదులుతున్న ట్రక్‌ లోనే ఆయన చూస్తుండగా... 8 మంది అతని భార్యపై గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం వారి వద్దనున్న బంగారం, డబ్బు దోచుకుని, గుర్తుతెలియని ప్రాంతంలో వదిలేశారు. ఆ తర్వాత ఎలాగోలా అరయ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఆ దంపతులు అక్కడ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News