: అందుకే, ‘బాహుబలి’లో పాడే అవకాశం నాకు రాలేదు: సింగర్ సునీత


ప్రముఖ సింగర్ సునీత ఈ రోజు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘‘బాహుబలి’ సిరీస్ లో మీకు అవకాశం ఎందుకు లభించలేదు?’ అని ప్రశ్నించగా, ‘బహు:శ కొత్త సింగర్స్, ఫ్రెష్ వాయిస్ కావాలని అనుకుని ఉంటారు. అందుకే, ఈ చిత్రంలో పాడే అవకాశం నాకు లభించలేదు. అయితే, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి గారి కాంబినేషన్ లో వచ్చిన చాలా చిత్రాల్లో నేను పాడాను. కొత్త సింగర్స్ కు వాళ్లు ఎప్పుడూ అవకాశాలు ఇస్తూ ఉంటారు’ అని సునీత చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News