: రోజుకు కనీసం ఒక్కసారైనా కవ్వింపు చర్యలకు పాల్పడిన పాక్!


జమ్మూకాశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి రోజుకి కనీసం ఒక్కసారైనా పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడిందట. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2015, 2016 సంవత్సరాల్లో పాకిస్థాన్ ప్రతిరోజూ కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడిందని పేర్కొంది. ఈ విషయమై సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని తెలిపింది.

2012 నుంచి 2016 వరకు 1142 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందన్నారు. ఈ కాల్పుల్లో దాదాపు 236 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, 90 మంది పౌరులు మృత్యువాత పడ్డారని, అదే సమయంలో 507 మంది ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయని పేర్కొంది.

  • Loading...

More Telugu News