: కెరీర్ లో ముందుకు వెళ్లాలని అనుకున్న వాళ్లు 'అడ్జస్ట్' అవుతారు: రమ్యకృష్ణ
దాదాపు 20 సంవత్సరాల క్రితం నీలాంబరిగా, ఇప్పుడు శివగామిగా నటిగా తన సత్తా చాటిన రమ్యకృష్ణ, ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. సినీ పరిశ్రమలో ఎదగాలంటే, 'అడ్జస్ట్ మెంట్' అన్న మెలిక ఎదురవుతుంటుందని ఇటీవలి కాలంలో పలువురు హీరోయిన్లు వ్యాఖ్యానిస్తుండటాన్ని ప్రస్తావిస్తూ, ఆడవాళ్లకు ఇబ్బందులు ప్రతి చోటా ఉంటాయని, అయితే, ఒక చోట సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటే, మరో చోట తక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చింది.
"వేరే ఫీల్డ్ ను ఎంచుకున్నా 'అడ్జస్ట్ మెంట్' ఉంటుందేమో? అయితే, అడ్జస్ట్ కావాలా? వద్దా? అనే విషయంపై ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. కెరీర్ లో ముందుకు వెళ్లాలని అనుకున్న వాళ్లు అడ్జస్ట్ అవక తప్పదు. అలా వద్దనుకునే వారూ ఉంటారు. అది వాళ్ల మైండ్ సెట్ పై ఆధారపడి వుంటుంది" అని వ్యాఖ్యానించింది. ఏది సరైనదనిపిస్తే, అది చేసుకుంటూ వెళ్లాలని, కొందరికి అది తప్పుగా అనిపించినా, ఎవరి జీవితంపై నిర్ణయాలు తీసుకునే హక్కు వారికి ఉంటుందని అభిప్రాయపడింది.