: కర్నూలులో దారుణం.. వేట కొడవళ్లతో ఇద్దరిని నరికి చంపిన ప్రత్యర్థులు
కర్నూలు జిల్లా సిరివెల్ల మండలం గోవిందపల్లెలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేట కొడవళ్లతో వచ్చిన కొందరు వ్యక్తులు ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి చేసి నరికి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిలో ఒకరు సిరివెల్ల మాజీ మండలాధ్యక్షుడు ఇందూరు ప్రభాకర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. మరొక వ్యక్తి ప్రభాకర్ రెడ్డి బావమరిది అని పోలీసులు తెలిపారు. ఈ హత్యలకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది.