: లెఫ్టినెంట్ గవర్నరా? లేక బీజేపీ ప్రతినిధా?: కిరణ్‌బేడీపై విరుచుకుపడ్డ నగ్మా
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీపై ఆలిండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సినీనటి నగ్మా పలు ఆరోపణలు గుప్పించారు. ఆమె లెఫ్టినెంట్ గవర్నర్‌లా కాకుండా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని నగ్మా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ పుదుచ్చేరిలోని కాంగ్రెస్ సర్కారుకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తోన్న పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, పేదలకు రేషన్ బియ్యం వంటి సంక్షేమ పథకాలు ముందుకు వెళ్లకుండా కిరణ్‌బేడీ అడ్డుతగులుతున్నారని వ్యాఖ్యానించారు. కిరణ్‌బేడీ రాజకీయాలు చేయడం మానేయాలని, పుదుచ్చేరి అభివృద్ధికి సాయపడాలని నగ్మా అన్నారు.