: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ...ఒడిషాలో ఏడుగురు మంత్రుల రాజీనామా
ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రి వర్గంలోని ఏడుగురు తమ పదవులకు రాజీనామా చేశారు. మరో ముగ్గురు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో వీరు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో అరుణ్ కుమార్ సాహు, సంజయ్ దాస్ బర్మ, దేవీ ప్రసాద్ మిశ్రా తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ, ప్రజలకు మరింత మెరుగైన సేవ చేసేందుకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నామని, ఈ నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేసి తనకు సహకరించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని చెప్పారు.