: నీ ఇంటి ముందే మీటింగ్ పెడతా.. దమ్ముంటే అడ్డుకో: తలసానికి షబ్బీర్ అలీ సవాల్
దిగ్విజయ్ సింగ్ ను హైదరాబాదులో అడుగుపెట్టనివ్వం అన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. దిగ్విజయ్ సింగ్ హైదరాబాదుకు రాగానే నీ ఇంటి ముందు కార్యకర్తలతో మీటింగ్ పెడతామని... దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణ పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు దిగ్విజయ్ వద్ద ఆధారాలు ఉన్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన తలసానికి దమ్ముంటే రాజీనామా చేసి, టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలవాలని అన్నారు. హైదరాబాదును అంతర్జాతీయ నగరం నుంచి స్కామ్స్ సిటీగా దిగజార్చారంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. కేటీఆర్ చెబుతున్న అభివృద్ధి అంతా మాటల్లోనే ఉందని... చేతల్లో లేదని విమర్శించారు. టీఆర్ఎస్ నాయకుల వేధింపుల కారణంగా పెట్టుబడులన్నీ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని మండిపడ్డారు.