: ఎయిర్ లైన్స్ సిబ్బందిపై ఇంకా శాంతించని శివసేన ఎంపీ
విమాన సిబ్బంది పట్ల అమర్యాదగా, అసభ్యంగా ప్రవర్తించే ప్రయాణికులపై నిషేధం విధించేలా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీని పట్ల ఇటీవల ఎయిర్ ఇండియా నిషేధానికి గురైన శివసేన ఎంపీ స్పందించారు. ఎయిర్ ఇండియా సిబ్బందికి కూడా నిబంధనలు విధించాలని ఆయన అన్నారు. ప్యాసింజర్లతో ఎలా ప్రవర్తించాలో వారికి తెలియజేయాలని చెప్పారు. ప్రయాణికుల పట్ల ఎయిర్ ఇండియా సిబ్బంది దారుణంగా వ్యవహరించిన ఘటనలు తనకు ఎన్నో తెలుసని అన్నారు. ప్రయాణికులకు సంబంధించి రూల్స్ పెట్టినప్పుడు, ఎయిరిండియా సిబ్బందికి కూడా రూల్స్ పెట్టాలని డిమాండ్ చేశారు.