: రష్యాలో చైనాకు ఎదురుదెబ్బ... సోషల్ మీడియా యాప్ పై నిషేధం


చైనాకి చెందిన సోషల్‌మీడియా పాప్యుల‌ర్‌ యాప్ వీచాట్‌పై రష్యాలో నిషేధం విధించారు. త‌మ‌ దేశ ఇంటర్నెట్‌ నియమ నిబంధనలకు అనుగుణంగా వీచాట్‌ యాప్‌ లేకపోవడంతో రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ యాప్‌ను టెన్సెంట్‌ టెక్నాలజీ కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ యాప్ కు 2016 నాటికి ప్రపంచవ్యాప్తంగా 889 మిలియన్ల యూజర్లు ఉన్నారు. ఈ నిషేధంపై స్పందించిన టెన్సెంట్ ప్ర‌తినిధులు మాట్లాడుతూ... రష్యాలో ఓ యాప్‌ను రిజిస్టర్‌ చేసుకోవాలంటే అక్క‌డి స‌ర్కారుతో సంబంధం ఉన్న ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ అవసరమ‌ని చెప్పారు. అయితే, త‌మ‌ సంస్థ ఆ అంశాన్ని మరోలా అర్థం చేసుకోవడంతో ఈ సమస్య తలెత్తిందని వివ‌రించారు. ఈ విష‌యంపై తాము ప్ర‌స్తుతం ర‌ష్యా ప్ర‌భుత్వంతో చర్చిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

చైనాలో త‌మ దేశ కంపెనీలు అభివృద్ధి చేసిన సోష‌ల్ మీడియానే ఉండాల‌నే ఉద్దేశంతో ఫేస్‌బుక్‌, ట్విటర్‌ లాంటి సామాజిక మాధ్యమాల‌పై ప్ర‌భుత్వం నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు విదేశంలో త‌మ యాప్‌ను నిషేధించ‌డంతో చైనాకు ఎదురుదెబ్బ తగిలింది.

  • Loading...

More Telugu News