: నేను రాజకీయాల్లోకి రాను...నాకు సమాజ సేవే ముఖ్యం: మంచు లక్ష్మి
తాను రాజకీయాల్లోకి రానని ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి తెలిపింది. నిర్భయ ఘటనపై తీర్పు వెలువడిన నేపథ్యంలో మంచు లక్ష్మి తన అభిప్రాయం చెప్పింది. స్త్రీని గౌరవించడం ఇంటి నుంచే నేర్పాలని సూచించింది. తాను రాజకీయాల్లోకి వస్తానంటూ వస్తున్న వార్తలపై స్పందించిన లక్ష్మి...తాను రాజకీయాల్లోకి రానని స్పష్టం చేసింది. తనకు సమాజ సేవ చేయడం ముఖ్యం కానీ, రాజకీయాల్లోకి రావడం ముఖ్యం కాదని చెప్పింది. అయితే రాజకీయాల్లో ఎక్కువ సమాజ సేవ చేయవచ్చని అభిప్రాయపడింది. అందుకు చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుందని తెలిపింది.