: భారత్ లోకి ప్రవేశించిన 12 ఏళ్ల పాక్ బాలుడు... పోలీసులకు అప్పగించిన సైన్యం!


పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లోని దుంగర్ పెట్ గ్రామానికి చెందిన బలూచిస్తాన్ రెజిమెంట్లో పాక్ సైనికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి కుమారుడు అష్ఫాక్ అలీ చౌహాన్ (12) జమ్మూ కశ్మీర్‌ లోని నియంత్రణ రేఖ వద్ద సరిహద్దులు దాటి ప్రవేశించాడు. రాజౌరీ జిల్లాలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు ఆర్మీ ప్రకటించింది. రెండు రోజుల క్రితం 15 ఏళ్ల బాలుడు ఇలాగే సరిహద్దు దాటిరాగా, అతడిని పాక్ ఆర్మీకి మన సైన్యం అప్పగించింది.

మళ్లీ ఈ రోజు మరో బాలుడు రావడంతో ఆర్మీ అనుమానిస్తోంది. అది కూడా జనసంచారం లేని ప్రాంతంలో బాలుడు కనిపించడానికి తోడు, పాక్ సైనికుడి కుమారుడు కావడంతో ఇది మామూలు వ్యవహారం కాదని భావించిన సైన్యం అతడిని విచారించింది. సరిహద్దు వద్ద భారత ఆర్మీ గస్తీని పరిశీలించడంతో పాటు చొరబాట్లకు పాల్పడేందుకు సురక్షిత దారులను కనిపెట్టి ఉగ్రవాదులకు సహకారం అందించడానికే చిన్నపిల్లలను పాక్ ఆర్మీ ప్రయోగిస్తోందని భావిస్తున్నారు. దీంతో బాలుడ్ని విచారించి, పోలీసులకు అప్పగించారు. 

  • Loading...

More Telugu News