: తాటి చెట్టు ఎక్కిన టీఆర్ఎస్ ఎంపీ!


టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తాటి చెట్టు ఎక్కారు. వివరాల్లోకి వెళ్తే, భువనగిరి మండలం నందనం గ్రామ సమీపంలో ఉన్న గౌడ పారిశ్రామిక కేంద్రంలో యంత్రం సహాయంతో తాటి చెట్టు ఎక్కేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని నర్సయ్య గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యంత్రం సాయంతో ఎంపీ తాటి చెట్టు ఎక్కారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ అనితా రామచంద్రన్, ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి కృష్ణ ప్రియ, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News