: రికార్డులు తిరగరాస్తున్న బాహుబలి 2 ... ఇప్పటివరకు 860 కోట్లు వసూలు!


‘బాహుబలి 2:ద కన్ క్లూజన్’ సినిమా అనితరసాధ్యమైన వసూళ్లతో భారతీయ చలనచిత్ర రికార్డులన్నీ తన ఖాతాలో వేసుకుని దూసుకుపోతోంది. భారత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిన ‘బాహుబలి 2: ద కన్ క్లూజన్’... ఇప్పుడు 1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా చరిత్రకెక్కనుంది. సుమారు 9000 ధియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘బాహుబలి 2’ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు (గ్రాస్‌) సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.

విడుదలైన అన్ని భాషల్లోనూ కలుపుకొని ఇప్పటివరకు సుమారు 860 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మన దేశంలో సుమారు 695 కోట్ల రూపాయల గ్రాస్ (545 కోట్ల రూపాయల నెట్‌) సాధించిన బాహుబలి... విదేశాల్లో 165 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో వారంలో అడుగుపెట్టిన ‘బాహుబలి 2’ సినిమాకి ఈ వారం కూడా బాక్సాఫీసు వద్ద పెద్ద పోటీ లేదు. దీంతో ఈ వారం గడిచే సరికి 1000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన తొలి భారతీయ, తెలుగు సినిమాగా చరిత్ర పుటలకెక్కనుంది. అంతే కాకుండా ఇప్పటికే అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించనుంది.

  • Loading...

More Telugu News