: యూపీ సీఎం యోగి ఓ యోధ సన్యాసి.. ప్రశంసలు కురిపించిన లోక్‌సభ స్పీకర్
ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన గొప్ప నేతలమని భావించ వద్దని, తాను తొలిసారి ఎంపీగా ఎన్నికైనప్పుడు అలాగే తప్పుగా భావించానని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి స్పీకర్ మాట్లాడుతూ యోగి.. ఓ యోధ సన్యాసి అని కొనియాడారు. ఆయన ధైర్యశాలి అని, లక్ష్య సాధనలో ఆయనెప్పుడూ నీరుగారిపోలేదని ప్రశంసించారు. సన్యాసి అంటే అన్నీ వదులుకున్నవాడు కాదని, కోరికలను మాత్రమే త్యజించిన వారని అన్నారు. తమ కర్మను తు.చ తప్పకుండా పాటించేవారే సన్యాసి అవుతారన్నారు. యోగి దానిని ఆచరణలో చూపించారని సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు.