: శేఖర్‌రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న రూ.33 కోట్లను జప్తు చేసిన ఈడీ
కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత నల్లకుబేరుడు శేఖర్‌రెడ్డి, ఆయన అనుచరుల నుంచి స్వాధీనం చేసుకున్న రూ.33.74 కోట్లను జప్తు చేసినట్టు ఈడీ ప్రకటించింది. గతేడాది నవంబరు 8న కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత శేఖర్‌రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.147 కోట్ల నగదు, 178 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదులో రూ.34 కోట్లకు పైగా ప్రభుత్వం విడుదల చేసిన రూ.2వేల నోట్లు ఉండడం అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో శేఖర్‌రెడ్డి, ఆయన అనుచరులపై అధికారులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా, శేఖర్‌రెడ్డి, ఆయన అనుచరుల నుంచి స్వాధీనం చేసుకున్న రూ.33.74 కోట్ల నగదు అక్రమ పద్ధతిలో సంపాదించినదేనని నిర్ధారించిన అధికారులు ఆ నగదును జప్తు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు.