: రామ్ చరణ్ కి భార్య పెట్టుకున్న ముద్దుపేరు!


తన భర్త రామ్ చరణ్ కు భార్య ఉపాసన పెట్టుకున్న ముద్దు పేరు మిస్టర్ సి. తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ పెట్టిన ఉపాసన... రామ్ చరణ్ ను మిస్టర్ సి అని సంబోధించింది. దీంతో ఉపాసన రామ్ చరణ్ ను ఎలా పిలుస్తుందో అభిమానులకు అర్థమైపోయింది. ఇదిలా ఉంచితే, సిటీలో కోడికూతతో నిద్రలేస్తున్నామని ఉపాసన ట్వీట్ చేసింది. తమ ఇంట్లోకి కొత్త పెంపుడు జంతువు వచ్చి చేరిందని, రాజమండ్రి ప్రాంత ప్రజలు దానిని బహూకరించారని... తమ కొత్త పెట్ అదేనని, ఆమె చెప్పారు.... అంతే కాకుండా చరణ్‌ కోడితో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేస్తూ...మిస్టర్‌ సి (చరణ్‌) నిజంగా తన తర్వాతి చిత్రం పాత్రలోకి లీనమయ్యారని తెలిపింది. ‘చక్కటి అనుభవం. సిటీ మధ్యలో ఉండి కోడికూతతో నిద్రలేస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News