: 8 ఏళ్ల వయసులోనే మరోసారి గిన్నిస్ బుక్‌లో చోటు!
ఆ బాలుడి వయసు ఎనిమిది సంవత్సరాలు మాత్రమే. అప్పుడే రెండోసారి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకొని అందరితో శభాష్ అనిపించుకున్నాడు. 475 అడుగుల దూరాన్ని కేవలం 30 సెంటీమీటర్ల ఎత్తుగల హర్డిల్స్ కింది నుంచి స్కేటింగ్ చేస్తూ వెళ్లడంతో ఆ బాలుడికి గిన్నిస్ బుక్ నిర్వాహకులు సర్టిఫికెట్ ఇచ్చేశారు. మణిపూర్‌కి చెందిన టిలుక్ కైసమ్‌కి లింబో స్కేటింగ్ అంటే ఎంతో ఆసక్తి. రెండేళ్ల క్రితం ఇదే స్కేటింగ్ లో గిన్నిస్ రికార్డులకెక్కిన కైసమ్... ఇప్పుడు ఆ తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు. అప్పట్లో ఈ బాలుడు 116 మీటర్ల దూరాన్ని ఇదే విధంగా స్కేటింగ్ చేశాడు. ఈ బాలుడి ప్రతిభను మీరూ చూడండి...