: తన భార్యను వేధిస్తున్న వారిని ప్రశ్నించినందుకు ప్రాణాలు తీశారు!
కర్ణాటకలోని నంజనగూడు తాలూకాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మొబైల్ రీచార్జ్ చేసుకోవడానికి తన దుకాణానికి వచ్చిన ఓ మహిళ నెంబరును సేవ్ చేసుకున్న ఓ వ్యక్తి ఆమెకు అశ్లీల ఫొటోలు, అసభ్య సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన ఆమె తన భర్త మహదేవ్ తో ఈ విషయం చెప్పింది. ఈ విషయాన్ని అడగడానికి వెళ్లిన ఆమె భర్తపై దుకాణదారుడు యోగేష్ దాడికి దిగాడు. తన భార్యకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించినందుకు యోగేశ్ తన స్నేహితులతో కలసి మహదేవ్‌పై మారణాయుధాలతో దాడి చేయడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు.
ఆయనపై దాడి చేసిన అనంతరం యోగేశ్ తన స్నేహితులతో కలిసి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకుని బాధితుడిని ఆసపత్రికి తరలించి చికిత్స అందించామని, అయితే చికిత్స పొందుతూ మహదేవ్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు.