: ఆరు వేలకే బంగ్లా కట్టినట్టు చేయబడితిరి..కేసీఆర్ వ్యాఖ్యలతో నవ్వులు!
హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో సీఎం కేసీఆర్ ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల వేతనాలను రూ.6 వేలకు పెంచుతున్నామని కేసీఆర్ ప్రకటించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తూ .. ‘జై కేసీఆర్’ అంటూ చప్పట్లు కొట్టారు. వెంటనే స్పందించిన కేసీఆర్.. ‘వద్దొదొద్దు .. అయిపాయే .. ఆరు వేలకే బంగ్లా కట్టినట్టు చేయబడితిరి. అట్లా కాదు కదా, మీరు, నేను కోరేవిధంగా.. మీరు మంచి తెలంగాణ ఆరోగ్య సంరక్షకులు కావాలి..ఆరోగ్య సైన్యం కావాలి. ఎందుకంటే, మనం ముసలోళ్లం అయిపోతున్నాము ... రేపు పుట్టే పిల్లలు ఎంత బలంగా పెరిగితే, ఎంత మంచిగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. గొప్ప రాష్ట్రం తయారవుతుంది. అది చేయడంలో మీ పాత్ర గీడకే అయిపోదు. మీకు ఆరు వేల కాడికే ఉండదు. మీకు మళ్లా ఒక్కసారి మంచిగా పెంచుతానని హామీ ఇస్తున్నా..’ అని కేసీఆర్ చెప్పడంతో ఆశా వర్కర్లు పెద్దపెట్టున క్లాప్స్ కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.