: ఒబామాకేర్ చ‌నిపోయింది: ట్రంప్


అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్న విష‌యం తెలిసిందే. గ‌త ప్ర‌భుత్వంలో కొన‌సాగిన ఒబామాకేర్ ఆరోగ్య బీమా ప‌థ‌కాన్ని ర‌ద్దు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ట్రంప్‌.. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. ఈ అంశంపై దిగువ స‌భ కాంగ్రెస్‌లో జ‌రిగిన ఓటింగ్‌లో రిపబ్లిక‌న్ పార్టీ విజ‌యం సాధించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 217 మంది, వ్య‌తిరేకంగా 213 మంది ఓటేశారు. ఆ ఆరోగ్య బీమా స్థానంలో కొత్త స‌ర్కారు రిప‌బ్లిక‌న్ హెల్త్ కేర్ బిల్లును ప్ర‌వేశ పెట్టగా ఆ బిల్లు దిగువ స‌భ‌లో ఆమోదం పొందింది. దీంతో ట్రంప్ అనుకున్నట్లుగానే ఇక అమెరికాలో ఒబామా కేర్ ర‌ద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్రంప్ ప్ర‌భుత్వ నిర్ణయాన్ని డెమోక్రాట్లు మాత్రం వ్య‌తిరేకించారు. ఒబామాకేర్‌ను ర‌ద్దు చేయ‌డం వ‌ల్ల ల‌క్ష‌లాది మంది అమెరిక‌న్లు ఆరోగ్య బీమా కోల్పోతారని వారు వాదించారు. ఈ బిల్లు ఇప్పుడు సెనేట్‌కు వెళ్తుంది. కాగా, సెనేట్‌లో బిల్లును మార్చి కొత్త చ‌ట్టాన్ని రూపొందించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నట్లు తెలుస్తోంది. తాము ప్ర‌వేశ‌పెట్టిన బిల్లుకు ఎక్కువ ఓట్లు రావ‌డంతో ఒబామాకేర్ చ‌నిపోయింద‌ని ట్రంప్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News