: కొత్త పార్టీ పెడుతున్న ములాయం సింగ్ యాదవ్.. 25 ఏళ్ల క్రితం స్థాపించిన సమాజ్ వాదీ పార్టీకి రాంరాం!
కన్న కొడుకు అఖిలేష్ సింగ్ యాదవ్ చేసిన వంచనకు గురై, చివరకు తాను స్థాపించిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించబడిన ములాయం సింగ్ యాదవ్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తమ్ముడు శివపాల్ యాదవ్ నేడు ప్రకటించారు. ఈ పార్టీకి 'సమాజ్ వాదీ సెక్యులర్ మోర్చా' అనే పేరు పెడుతున్నట్టు తెలిపారు. ములాయంకు తిరిగి గౌరవం తీసుకొచ్చేందుకు, సమాజ్ వాదీ పార్టీకి చెందిన వాళ్లందరినీ మళ్లీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకే ఈ పార్టీని స్థాపిస్తున్నామని చెప్పారు.
దాదాపు పాతికేళ్ల క్రితం సమాజ్ వాదీ పార్టీని ములాయం స్థాపించారు. ఆ సమయంలో కూడా తమ్ముడు శివపాల్ యాదవ్ ములాయంకు అండగా ఉన్నారు. ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్న సందర్భంగా కూడా తమ్ముడు శివపాల్ ను తనతో తీసుకెళుతున్నారు. అయితే, వీరు పెడుతున్న కొత్త పార్టీలోకి ఎస్పీ నుంచి ఎంతమంది నేతలు వస్తారో వేచి చూడాలి.