: ‘బాహుబలి’తో నా పని ముగిసిపోయింది: రాజమౌళి


'బాహుబలి-2' చివరి ప్రమోషన్ ఈవెంట్ లండన్ లో ముగిసింది. ఈ సినిమా కోసం దర్శకదిగ్గజం రాజమౌళి ఐదేళ్లపాటు రేయింబవళ్లు కష్టపడ్డాడు. లండన్ ప్రమోషన్ ఈవెంట్ ముగిసిన తర్వాత రాజమౌళి ట్వీట్ చేశాడు. "లండన్ లో జరిగిన ఈ చివరి ప్రమోషన్ ఈవెంట్ తో... బాహుబలి సినిమా సిరీస్ తో నా పని ముగిసిపోయింది" అని తెలిపాడు. 'మై జాబ్ ఈజ్ కంప్లీట్లీ ఓవర్' అని చెప్పాడు. ఈ సినిమాను ఇంతగా ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

  • Loading...

More Telugu News