: మలయాళ హీరోయిన్ కు కలిసొచ్చిన అదృష్టం... డ్రాలో అరకిలో బంగారం గెలుచుకున్న వైనం!


ఏ రంగంలోనైనా ఎంత టాలెంట్ ఉన్నా, కూసింత అదృష్టం కూడా ఉంటేనే రాణిస్తారన్న సంగతి తెలిసిందే. కానీ మలయాళ హీరోయిన్ ఐమారోస్నీ సెబాస్టియన్ కు ఈ రెండూ ఉన్నాయి. గత సంవత్సరం 'జకాబ్నేట్ స్వర్గరాజ్యం' అనే మలయాళ సూపర్ హిట్ చిత్రంలో నటించిన ఆమె, మొన్నటి అక్షయ తృతీయ సందర్భంగా దుబాయ్ లోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో షాపింగ్ చేసి తనకు, తన చెల్లెళ్లకు నగలు కొనుక్కుంది.

ఆపై తమ పేర్లను రాసి, డ్రాప్ బాక్సులో వేయగా, నిన్న విజేతలను ఎంపిక చేసేందుకు డ్రా తీస్తే, ఐమారోస్నీ పేరు వచ్చింది. ఈ డ్రాలో ఏకంగా అరకిలో బంగారాన్ని ఆమె గెలుచుకుంది. ఇక ఇంత అదృష్టం తనను వరిస్తుందని కలలో కూడా ఊహించలేదని ఉబ్బితబ్బిబ్బవుతున్న ఈ అందాల భామ, ప్రస్తుతం తాను సినిమాలతో పాటే, మణిపాల్ యూనివర్శిటీలో ఎంబీఏ చేస్తున్నానని చెబుతోంది.

  • Loading...

More Telugu News