: అవును! పతంజలి మందుల్లో గోమూత్రం వినియోగించాం: రాందేవ్ బాబా సంచలన ప్రకటన


ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాము కేవలం ఐదు ఉత్పత్తుల్లోనే గో మూత్రం వినియోగించామని తెలిపారు. అయితే పతంజలి ఉత్పత్తులు అన్నిట్లోనూ గోమూత్రం కలుపుతామంటూ తమ ఉత్పత్తులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ముస్లిమ్లను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాము గో మూత్రం కలిపామన్న విషయాన్ని ఆయా ఉత్పత్తుల ప్యాకెట్లపై స్పష్టంగా పేర్కొన్నామని ఆయన తెలిపారు. కేన్సర్ నివారణ కోసం తాము తయారు చేసిన పంచ గోయ మందులో గోమూత్రం కలిపామని ఆయన వెల్లడించారు. కాగా, పతంజలి యోగా తయారు చేసిన నూడుల్స్ లో బూడిద వినియోగించినట్టు గతంలో పరీక్షల్లో తేలగా... తాజాగా గోమూత్రం వినియోగించామని ప్రకటించడం ఆ సంస్థ ఉత్పత్తులపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News