: హర్యానా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నివాసం, ఆఫీసుల్లో భారీ ఎత్తున నగదు లభ్యం


హర్యానాలోని ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులు స్వతంత్ర (ఇండిపెండెంట్) ఎమ్మెల్యే జస్బీర్ దేశ్వాల్ ఇల్లు, ఆఫీసులపై దాడులు నిర్వహించి నివ్వెరపోయారు. షెల్ కంపెనీల పేరుతో నగదు లావాదేవీలు నిర్వహించారంటూ ఆయనపై అనుమానాలు రేకెత్తడంతో నిఘా వేసిన అధికారులు...ఆయన నివాసం, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జస్బీర్ దేశ్వాల్ నివాసం, ఆఫీసుల నుంచి 8 కోట్ల రూపాయల నగదుతోపాటు 2 కోట్ల రూపాయల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, నోట్ల రద్దు అనంతరం పలువురి ఆదాయాల వివరాలపై ఐటీ విభాగం నిఘా పెట్టిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News