: రేప్ కు ఒప్పుకోలేదని యువతిని బీర్ బాటిల్ తో పొడిచిన యువకుడు


ప్రకాశం జిల్లా వలేటివారిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఓ యువతిపై ఘట్టమనేని రవి అనే యువకుడు అత్యాచారయత్నం చేశాడు. యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఘట్టమనేని రవి... బీరు బాటిల్ తో ఆమెను పొడిచాడు. దీంతో తీవ్రరక్తస్రావమైన ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమెను స్థానికులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. దీంతో అదను చూసుకుని ఘట్టమనేని రవి పరారయ్యాడు. యువతి కుటంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. 

  • Loading...

More Telugu News