: మోదీ కంటే మన్మోహన్ విదేశీ పర్యటనలే ఎక్కువ.. అమిత్ షా
ప్రధాని నరేంద్రమోదీ కంటే మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ విదేశీ పర్యటనలే ఎక్కువని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ప్రస్తుత ప్రధాని మోదీతో పోలిస్తే మన్మోహనే ఎక్కువ విదేశీ పర్యటనల్లో పాల్గొన్నారని ఆయన అన్నారు. అయితే మన్మోహన్ పర్యటనలకు మీడియాలో ప్రాధాన్యం లభించకపోవడంతో వాటి గురించి పెద్దగా తెలియకుండా పోయిందన్నారు. మన్మోహన్ సింగ్ తొలిసారి ప్రధాని అయినప్పుడు 144 రోజుల్లో 38 దేశాల్లో పర్యటించారని షా తెలిపారు. రెండోసారి ప్రధానిగా 161 రోజుల్లో 38 దేశాల్లో పర్యటించినట్టు చెప్పారు. ప్రధానిగా వాజ్‌పేయి 26 దేశాల్లో పర్యటిస్తే, మోదీ ఇప్పటి వరకు 56 దేశాల్లో పర్యటించారని అమిత్ షా వివరించారు.