: బంగ్లాదేశ్ లో బాహుబలి ఫీవర్.. సినిమా చూసేందుకు ఛార్టర్డ్ ఫ్లైట్ లో వచ్చిన అభిమానులు


బాహుబలి సినిమా మన దేశంలోనే కాకుండా అమెరికా, దుబాయ్, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో సైతం మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లో విడుదల కాలేదు. దీంతో, బాహుబలి తొలి భాగం చూసిన అక్కడి ప్రేక్షకులలో 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' అనే కుతూహలం బాగా పెరిగిపోయింది.

దీంతో, అక్కడ ఏమాత్రం ఆగలేకపోయిన ధనిక ప్రేక్షకులు ఏకంగా ఓ ఛార్టర్డ్ ఫ్లైట్ వేసుకుని ఢాకా నుంచి కోల్ కతా వచ్చారు. కోల్ కతాలో 'బాహుబలి-2' సినిమాను ఎంజాయ్ చేసి, ఆనందంగా తిరిగి వెళ్లిపోయారు. బాహుబలి ప్రభంజనం ఏ రేంజ్ లో ఉందో ఈ ఘటనను చూస్తే అర్థమవుతుంది.

  • Loading...

More Telugu News