: టీమిండియా కొత్త జెర్సీని విడుదల చేసిన బీసీసీఐ, ఒప్పో


టీమిండియా ఆటగాళ్లకు కొత్త జెర్సీ అందుబాటులోకి వచ్చింది. ముంబైలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ జెర్సీని బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ, ఒప్పో మొబైల్స్ అధికారులు విడుదల చేశారు. టీమ్ ఇండియాకు ఒప్పో మొబైల్స్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల కాలానికి గాను టీమిండియాకు స్పాన్సర్ గా వ్యవహరించేందుకు బీసీసీఐకి ఒప్పో రూ. 1,079 కోట్లు చెల్లించింది. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ ఇంకా టీమ్ ను ప్రకటించలేదు. రెవెన్యూ పంపకం విషయంలో ఐసీసీతో తలెత్తిన వివాదం నేపథ్యంలో బీసీసీఐ ఆగ్రహంతో ఉంది. ఒకవేళ ఈ టోర్నీలో టీమిండియా పాల్గొంటే... ఈ కొత్త జెర్సీని మన ఆటగాళ్లు ధరిస్తారు. 

  • Loading...

More Telugu News