: ‘అమెజాన్’ ఆఫర్లు.. 11 నుంచి ‘గ్రేట్ ఇండియన్ సేల్’


ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో ఈ నెల 11 నుంచి ‘గ్రేట్ ఇండియన్ సేల్’ ప్రారంభం కానుంది. ప్రముఖ బ్రాండ్స్ అన్నింటిపైనా గ్రేట్ డీల్స్ ను ఆఫర్ చేస్తామని, త్వరితగతిన డెలివరీ చేస్తామని ‘అమెజాన్’ పేర్కొంది. కాగా, ఈ-కామర్స్ సంస్థ ‘ఫ్లిప్ కార్ట్’ ఈ నెల రెండో తేదీన ప్రకటించిన ‘సమ్మర్ షాపింగ్ డేస్ సేల్’ నేటితో ముగియనుంది. ‘ఫ్లిప్ కార్ట్’, ‘అమెజాన్’ సంస్థల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో సమ్మర్ సేల్ ఆఫర్లు వెలువడుతుండటం వినియోగదారులకు వరంగా మారింది. ఆయా బ్రాండ్లకు సంబంధించిన వస్తువులను అసలు ధరతో పోలిస్తే తక్కువ ధరకే సొంతం చేసుకుంటున్నారు. 

  • Loading...

More Telugu News