: ‘వజ్ర’ మినీ బస్సు సర్వీసులు ప్రారంభం..ఇకపై జీహెచ్ఎంసీ నుంచి ఆర్టీసీకి నిధులు: సీఎం కేసీఆర్
టీఎస్ఆర్టీసీ ‘వజ్ర’ మినీ బస్సు సర్వీసులను సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో ప్రారంభించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని, ఎన్ని వాహనాలు ఉన్నా ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా కార్మికులకు ఫిట్ మెంట్ ఇచ్చామని, నాలుగు వేల మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించామని, ఆక్యుపెన్సీ రేషియో (ఐఆర్) కోసం ఆర్టీసీ కార్మికులు, అధికారులు కష్టపడాలని కేసీఆర్ సూచించారు. ఇకపై జీహెచ్ఎంసీ నుంచి ఆర్టీసీకి ప్రతి నెలా నిధులు అందజేస్తామని ప్రకటించారు. కాగా, వజ్ర మినీ బస్సుల ఆన్ లైన్ రిజర్వేషన్ల కోసం ఆర్టీసీ మొబైల్ యాప్ ను ఆవిష్కరించారు. ఈ బస్సు సర్వీసులు తొలిదశలో వరంగల్-హైదరాబాద్, నిజామాబాద్-హైదరాబాద్ రూట్ల మధ్య తిరుగనున్నాయి.