: ఆ పాపకి తలనొప్పి వచ్చినప్పుడల్లా కళ్లు, చెవులు, చేతుల నుంచి రక్తం!
ఏ గాయం కాకుండానే కళ్లు, చెవులు, చర్మం నుంచి రక్తం కారడం వంటి దృశ్యాలు సాధారణంగా మనం హర్రర్ సినిమాల్లోనే చూస్తుంటాం. అయితే, థాయ్‌లాండ్‌లోని నాంగ్‌ఘాయ్‌కు చెందిన ఏడేళ్ల ఫాకమడ్ సాంగ్‌చాయ్ అనే ఏడేళ్ల పాప కళ్లు, చెవులు, చేతులు, చర్మం నుంచి రక్తం కారుతోంది. గత ఆరునెలలుగా ఆ పాప ఈ చిత్రమైన జబ్బుతో బాధ పడుతోంది. తమ కూతురికి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుందని, అలా వచ్చినప్పుడల్లా ఇలా శరీరంలోని ఏదో ఒక భాగం నుంచి రక్తం కారిపోతోందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు.
ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఆ పాప జబ్బు నయం కాకపోతుండడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఇప్పటివరకు ఇటువంటి కేసులు మూడు, నాలుగు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. దీన్ని ‘హెమటోహైడ్రాసిస్’ అని పిలుస్తారని వైద్యులు అంటున్నారు. మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు మనిషి శరీరంలోని ఏదో భాగంలో రక్తనాళాలు చిట్లిపోయి ఇలా రక్తం కారుతుందని వివరించారు.