: లైన్ క్లియర్... త్వరలో భారత్ కు విజయ్ మాల్యా
భారతీయ బ్యాంకుల్లో వేలాది కోట్లు అప్పులు చేసి, ఎంచక్కా విమానం ఎక్కి విదేశాలకు వెళ్లిపోయిన బడా వ్యాపారవేత్త, లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా లండన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం బ్రిటన్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆయనను ఇటీవలే అరెస్టు చేసిన లండన్ పోలీసులు, విజయ్ మాల్యాను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
అయితే, తాజాగా ఆయన అక్కడి నుంచి భారత్‌కు రావడానికి లైన్ క్లియర్ అయింది. ఆయనను భారత్‌కు అప్పగించడానికి ఆ దేశ ప్రభుత్వం ఒప్పుకుంది. దీంతో విజయ్ మాల్యాకు షాక్ తగిలింది. తనను అరెస్టు చేసినప్పటికీ మాల్యా కూల్ గా ఇంట్లో కూర్చొని ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ మీడియా తన అరెస్టుపై అతిగా కథనాలు ప్రచరిస్తోందని, తనకు ఏమీ కాదన్నట్లు మాల్యా ఇటీవలే ట్వీట్లు చేశాడు.