: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు రామోజీరావు ఫోన్
ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణతో 'ఈనాడు' సంస్థల అధినేత రామోజీరావు ఫోన్ లో మాట్లాడారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ ఆంధ్రజ్యోతి హెడ్ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై రాధాకృష్ణతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న రామోజీరావు విచారం వ్యక్తం చేశారు. జరిగిన నష్టం ఏ మేరకు ఉందన్న విషయం తెలుసుకున్న ఆయన, పత్రిక నిర్వహణలో ఎటువంటి సహాయాన్నైనా అందిస్తానని హామీ ఇచ్చారు. కాగా, ఈ ప్రమాదంలో ఆంధ్రజ్యోతి కార్యాలయంలోని రెండు ఫ్లోర్లు పూర్తిగా దగ్ధమైన సంగతి తెలిసిందే. రెండు ఫ్లోర్లలోని కంప్యూటర్లూ కాలిపోయాయి.