: మరో రెండు విదేశీ భాషల్లోకి 'బాహుబలి-2'
సంచలన విజయం నమోదు చేసిన రాజమౌళి విజువల్ వండర్ 'బాహుబలి-2' బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు మరో వార్త వినిపిస్తోంది. మరో రెండు భాషల్లోకి ఈ చిత్రాన్ని డబ్ చేసి, విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. 'బాహుబలి-1' సినిమాకు చైనాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ నేపథ్యంలో, 'బాహుబలి-2' చిత్రాన్ని చైనా భాషలోకి అనువదించి, విడుదల చేయాలనుకుంటున్నారట. అంతేకాదు, జపాన్ లో కూడా ఈ సినిమాను డబ్బింగ్ చేసి, విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇదే జరిగితే... 'బాహుబలి-2' కలెక్షన్ల పరంగా మరింత ఎత్తుకు వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్.