: 'ఆపిల్' బ్రాండ్ అంబాసిడర్ గా షారూఖ్ ఖాన్!
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం... స్మార్ట్ ఫోన్ రారాజు యాపిల్ కు భారత్ లో బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ను నియమించినట్టు తెలుస్తోంది. 2016లో యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ముంబైలోని షారూఖ్ ఖాన్ ఆతిధ్యాన్ని స్వీకరించాడు. ఈ సమయంలో యాపిల్ తో షారూఖ్ టైఅప్ అయ్యాడని, సరికొత్త వ్యాపార ప్రణాళికతోనే టిమ్ కుక్ కు షారూఖ్ ఆతిథ్యమిచ్చాడని వార్తలు వచ్చాయి. ఆ తరువాత అలాంటి ప్రకటన ఏదీ లేనప్పటికీ... సుదీర్ఘ విరామం తరువాత యాపిల్ బ్రాండ్ అంబాసిడర్ గా షారుక్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.