: అలాంటి వాటిని నేను అస్సలు ప్రోత్సహించను: శ్రుతి హాసన్‌


ఫెయిర్ నెస్ క్రీమ్స్ ని అస్సలు ప్రమోట్ చేయనని సినీ నటి శ్రుతి హాసన్‌ స్పష్టం చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కలర్ ఇంప్రూవ్ అయ్యేందుకు బ్యూటీ టిప్స్ చెప్పమంటే మండిపడింది. చిన్నప్పుడు తాను రంగు తక్కువగా ఉండేదానినని, ఇంకాస్త తెల్లగా ఉంటే బాగుండేదని చాలా సందర్భాల్లో బాధపడ్డానని వెల్లడించింది. అసలు శరీర రంగుకు ప్రాధాన్యత ఇవ్వనని చెప్పింది.

మనమేంటో మన క్యారెక్టర్ చెబుతుంది. మనం చేసే పనులు, వ్యవహరించే విధానం మనమేంటో చెబుతాయి. అలాంటప్పుడు రంగు గురించి చింత ఎందుకు? అని ఆమె ప్రశ్నించింది. రంగు మెరుగుపరుచుకునేందుకు ఎలాంటి టిప్స్ చెప్పనని స్పష్టం చేసింది. ఫెయిర్ నెస్ క్రీములను కూడా తాను సపోర్ట్ చేయనని, వాటిని ప్రమోట్ కూడా చేయనని స్పష్టం చేసింది. అసలు రంగు తక్కువగా ఉన్నామని ఎందుకు బాధపడాలి? అని ప్రశ్నించింది. తన చిన్నప్పటిలా ఇప్పుడు ఆలోచించడం లేదని, అందుకే ఇప్పుడే కాదు ఎప్పుడూ ఫెయిర్‌ నెస్‌ క్రీమ్స్‌ ని, ఆల్కహాల్‌ ని ప్రమోట్ చేయనని తెలిపింది. వీటికి బ్రాండ్‌ అంబాసిడర్‌ గా కూడా పని చేయనని స్పష్టం చేసింది. మద్యం మనిషి ఆరోగ్యంతో పాటు సమాజానికి కూడా చేటు చేస్తుందని ఆమె తెలిపింది. 

  • Loading...

More Telugu News