: ఏపీకి తీపి కబురు.. గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉండగా కేంద్ర ప్రభుత్వం ఓ తీపి కబురు చెప్పింది. కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వెల్లడించారు. ఏడో వేతన సంఘం సిఫారసుల్లో సవరణలను మంత్రి వర్గం ఆమోదించడం, జాతీయ ఉక్కు విధానానికి కేబినెట్ ఆమోదం తెలియజేయడం వంటి నిర్ణయాలు ఉన్నాయి.