: గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన అర్థం చేసుకోండి: సర్కారుకి పవన్ కల్యాణ్ లేఖ


ఏపీలో గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి తాము ఇప్ప‌టికే విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారమే నిర్ణీత తేదీల్లో మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తామని, ఇందులో మార్పులేమీ ఉండ‌బోవ‌ని ఏపీపీఎస్సీ స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. అయితే, గ్రూప్-2 ప‌రీక్ష వాయిదా వేయాల‌ని అభ్య‌ర్థులు కోరుకుంటున్నారు. ఈ అంశంపై జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. ఈ అంశంపై ప్ర‌భుత్వం మ‌రోసారి ఆలోచించాల‌ని ఆయ‌న ఓ లేఖ ద్వారా కోరారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ప‌రీక్ష‌ల మధ్య 45 రోజులు మాత్రమే ‌గడువు ఉందని, ఆ సమయం అభ్యర్థులకు స‌రిపోద‌ని, అభ్య‌ర్థుల్లో ఆందోళ‌న నెల‌కొంద‌ని ఆయ‌న అన్నారు. వారి ఆందోళ‌న‌ను ప్ర‌భుత్వం అర్థం చేసుకొని, అభ్య‌ర్థుల‌కు న‌ష్టం క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News