: రాళ్లు రువ్విన యువకుడి పని పట్టిన ఆర్మీ జాగిలాలు!
శ్రీనగర్ లో భారత సైనికులతో పాటు జాగిలాలపై కొందరు యువకులు రాళ్లు రువ్విన సంఘటనలో ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. రాళ్లు రువ్విన ఓ యువకుడిపై రెండు జాగిలాలు దాడి చేసి తమ తడాఖా చూపించాయి. కండ ఊడొచ్చేలా పట్టుకుని పీకేశాయి. అక్కడే ఉన్న ఓ జవాన్ వెంటనే స్పందించి.. వాటి బారి నుంచి ఆ యువకుడిని అతికష్టం మీద విడిపించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.