: జైల్లో ఉన్న రైతులను పరామర్శించిన రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ అరాచక పాలనలో రైతులు అనేక కష్టాలు పడుతున్నారని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిడ్డారు. రైతులను జైల్లో పెట్టి రౌడీలను అరెస్ట్ చేశామని టీఆర్ఎస్ నేతలు చెబుతుండటం దారుణమని విమర్శించారు. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని... వారి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చెప్పేదొకటి, చేసేదొకటని విమర్శించారు. ఖమ్మం జైల్లో ఉన్న రైతులను ఈ రోజు రేవంత్ రెడ్డి, ఎల్.రమణ, నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య, సీతక్క తదితరులు పరామర్శించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.