: అమిత్ షాకు షాక్ ఇచ్చిన రాజు దంపతులు!
సరిగ్గా వారం రోజుల క్రితం పశ్చిమబెంగాల్ లోని నక్సల్ బరి ప్రాంతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించారు. ఈ సందర్భంగా రోజువారీ కూలీలుగా పని చేసే రాజు, గీత దంపతుల ఇంట్లో ఆయన నేల మీద కూర్చొని భోజనం చేశారు. ఈ నేపథ్యంలో, గత రెండు రోజుల నుంచి రాజు దంపతులు కనిపించలేదు. దీంతో, వారిని తృణమూల్ నేతలు కిడ్నాప్ చేశారని స్థానిక బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
కానీ, అమిత్ షాకు, బీజేపీ నేతలకు రాజు, గీతలు ఊహించని షాక్ ఇచ్చారు. వారిద్దరూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమను ఎవరూ బెదిరించలేదని చెప్పారు. మమతా బెనర్జీ అంటే తమకు ఎంతో ఇష్టమని... అందుకే ఆ పార్టీలో చేరామని తెలిపారు. మమత మా ఇంటికి వస్తే, ఆమెకు కూడా భోజనం పెడతామని చెప్పారు.