: సీరియల్ యాక్టర్ ప్రదీప్ ఆత్మహత్య
తెలుగు సీరియల్ యాక్టర్ ప్రదీప్ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన హైదరాబాదులో కలకలం రేపింది. హైదరాబాదులోని అలకాపురి కాలనీ గ్రీన్ హోమ్స్ లోని అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ప్రదీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సప్తమాత్రిక సీరియల్ లో నటించిన ప్రదీప్ మంచి పేరుతెచ్చుకున్నాడు. దీంతో సప్తపది, ఆరుగురు పతివ్రతలు సీరియల్స్ లో అవకాశాలు దక్కించుకున్నాడు. అయితే ప్రదీప్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.