: అశ్లీల చిత్రాలను వాట్సాప్ గ్రూప్‌లో పెట్టిన ఎమ్మెల్సీ.. కర్ణాటకలో సంచలనం


ఆయనో ప్రజాప్రతినిధి.. అయితేనేం, తనలో లేకిబుద్ధులు ఏమాత్రం పోలేదని  నిరూపించుకున్నాడు. అశ్లీల చిత్రాలను వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేసి కలకలం రేపాడు. కర్ణాటకలోని బెల్గావి పట్టణానికి చెందిన బీజేపీ ఎమ్మెల్సీ మహన్ తేష్ కవతగిమాత్ కేఎల్ఈ సొసైటీ పేరిట పలు విద్యాసంస్థలు, ఆర్థిక సంస్థలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మహన్ తేష్ బెల్గావి మీడియా ఫోర్స్ వాట్సాప్ గ్రూపులో సీనియర్ రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, జర్నలిస్ట్‌లకు చెందిన 50 వరకు అశ్లీల చిత్రాలను తీవ్ర వ్యాఖ్యలతో పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు.

ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంతో వెంటనే ఆ చిత్రాలను తొలగించినట్టు వాట్సాప్ గ్రూప్ నిర్వాహకుడు మహబూబ్ మకందర్ తెలిపారు. ఓ ప్రజాప్రతినిధే ఇటువంటి చిత్రాలను పోస్ట్ చేశారంటే ఇందులో ఏదో ఉండే ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ పోస్టు చేసిన అశ్లీల చిత్రాల వ్యవహారం కర్ణాటకలో చర్చనీయాంశమైంది.

  • Loading...

More Telugu News